BRS strategies for Telangana assembly elections : ఎన్నికలకు పూర్తిస్థాయిలో సయామత్తమైన బీఆర్ఎస్ చేరికలపై మరింత దూకుడు పెంచనున్నట్లు తెలిసింది. ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న కొందరు ముఖ్యనాయకులను చేర్చుకోవడంపై దృష్టిపెట్టింది. ఉమ్మడి నల్గొండ, మెదక్ జిల్లాకు చెందిన కొందరు నాయకులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉండి గెలిచేందుకు అవకాశం లేదని భావించిన చోట ఇతర పార్టీల్లో ప్రధాన ప్రత్యర్ధిగా ఉండి పరిస్థితిని అనుకూలంగా ఉన్నవారిని తమవైపు తిప్పుకోవాలనేది బీఆర్ఎస్ లక్ష్యంగా కనిపిస్తోంది.
కొందరు ముఖ్యులు వస్తే ఆ పార్టీ పని అయిపోయిందనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలుగుతుంది కనుక అలాంటివారిని చేర్చుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఇద్దరు ప్రధాన ప్రజాప్రతినిధులు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ముఖ్యనేతలుబుధవారం చేరికలపై విస్తృతంగా చర్చించారు. భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్ రెడ్డికి టికెట్ గురించి ఏ హామీ ఇవ్వలేదని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాభువనగిరి ఎంపీటికెట్ లేదా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు వీలుగా రెండు, మూడు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.
Nalgonda BRS latest politics : భువనగిరి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బూరనర్సయ్య గౌడ్.. ఇప్పటికే బీఆర్ఎస్కి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అక్కడి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని రంగంలోకి దించాల్సిందే. గత పదేళ్లుగా విపక్షంలోనే ఉండటం, భారీగా పెరిగిన ఎన్నికల వ్యయాన్ని భరించడం నేతలకు కష్టంగా మారింది. ఒకవేళ ఖర్చు భరించి ఎన్నికల్లో గెలిచినా మళ్లీ విపక్షంలో కూర్చోవల్సి వస్తే ఏం లాభం? దానికంటే పార్టీ మారితే ఎన్నికల ఖర్చు భారం ఉండదు.