BRS on MLA Quota MLC Elections 2024 : శాసనసభ కోటా ఎమ్మెల్సీగా (Telangana MLC Election Schedule 2024)బీఆర్ఎస్ ఎవరికి అవకాశం కల్పిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కడియం శ్రీహరి, పాడికౌశిక్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రెండు మండలి స్థానాలకు, ఈనెల 29న పోలింగ్ జరగనుంది. ప్రస్తుత బలాబలాల ప్రకారం భారత్ రాష్ట్ర సమితి ఒక స్థానం దక్కే అవకాశం ఉండటంతో ఎవరిని ఎంపిక చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను నామినేటెడ్ ఎమ్మెల్సీగా గతంలో మంత్రివర్గం సిఫార్సు చేస్తే గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తిరస్కరించగా వారు ఇటీవలే కోర్టును ఆశ్రయించారు.
MLA Quota MLC Elections Telangana 2024 :ప్రస్తుతం అధికారం కోల్పోయినందున దాసోజు శ్రవణ్‌కు (Dasoju Shravan) అసెంబ్లీ కోటాలో, మండలికి పంపే అవకాశం లేకపోలేదంటున్నారు. గతంలో పాడికౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ తిరస్కరించినపుడు అదే తరహాలో శాసనసభ్యుల కోటా నుంచి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. ఎరుకల సామాజికవర్గానికి చెందిన కుర్రా సత్యనారాయణని పరిగణలోకి తీసుకోవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉండి ఇటీవలి ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాజయ్య, మదన్‌రెడ్డి పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశంఉంది.
ప్రజాతీర్పును గౌరవిద్దాం - ఎన్నికల ఫలితాలపై త్వరలో సమీక్ష ఉంటుందన్న కేసీఆర్
మదన్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం :వాస్తవానికి మదన్‌రెడ్డికి మెదక్ లోక్‌సభ టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది. అయితే మారిన పరిస్థితిలో, మెదక్ నుంచి కేసీఆర్ లోక్‌సభకు పోటీ చేసే ఆలోచన ఉంటే మదన్‌రెడ్డికి మండలి అవకాశం ఇచ్చే ఉందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, రావుల చంద్రశేఖర్‌రెడ్డితో పాటు తులఉమ, గాలి అనిల్ కుమార్, జిట్టా బాలకృష్ణారెడ్డి పేర్లు పరిగణలోకి వచ్చే అవకాశంఉంది.