తెలంగాణ

telangana

ETV Bharat / state

గవర్నర్ వ్యవస్థపై పార్లమెంట్​లో చర్చ జరగాలి: కేశవరావు - గవర్నర్ తమిళిసై సౌందర రాజన్

రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణపై నిర్ణయం తీసుకున్నాక వెల్లడిస్తామని బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు. అదేవిధంగా గవర్నర్ వ్యవస్థపై పార్లమెంట్​లో చర్చ జరగాలని కేశవరావు తెలిపారు.

brs
brs

By

Published : Jan 30, 2023, 3:42 PM IST

Updated : Jan 30, 2023, 3:58 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కోసం కోర్టు సహాయం కోరాల్సి వస్తోందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు అన్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురు కాలేదని గుర్తు చేశారు. బడ్జెట్​కు ఆమోదం తెలపకుండా గవర్నర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థపై పార్లమెంట్​లో చర్చ జరగాలని అన్నారు. దిల్లీ, తమిళనాడు, కేరళ సహా.. ప్రతిపక్ష పార్టీలు ఉన్న అనేక రాష్ట్రాల్లో.. గవర్నర్ వ్యవస్థ గురించి ఇబ్బందులు ఉన్నాయని కేశవరావు వివరించారు.

సమాఖ్య వ్యవస్థ, ఫెడరలిజం గురించి చర్చ జరగాలని కేశవరావు చెప్పారు. అసెంబ్లీని నిరవధిక వాయిదా వేయనందున.. గవర్నర్ ప్రసంగం అవసరం లేదని కేశవరావు వెల్లడించారు. అసెంబ్లీలో ప్రసంగం గురించి గవర్నర్​కు అభ్యంతరాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వంతో కూర్చుని మాట్లాడాలని సూచించారు. రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణపై నిర్ణయం తీసుకున్నాక వెల్లడిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేశవరావు వివరించారు.

దేశ సమస్యలపై చర్చ జరపాలి:కేంద్రం రైతుల పంటల మద్దతు ధర రెట్టింపు చేయలేదని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు ఆరోపించారు. నిరుద్యోగ అంశంపైనా చర్చ జరగాలని కోరామని తెలిపారు. దేశ సమస్యలపై చర్చ జరపాలని డిమాండ్ చేశామని వివరించారు. కేవలం బిల్లుల ఆమోదం కాదు.. ప్రజా సమస్యలపై, గవర్నర్ వ్యవస్థపై చర్చ జరపాలని పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర సమస్యలు లెవనెత్తుతామని నామా నాగేశ్వరరావు వివరించారు.

రాజ్యాంగ పదవిలో ఉన్న వారు హద్దుల్లో ఉండాలి: గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి వివాదం కొనసాగుతున్న శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తీవ్రవ్యాఖ్యలు చేశారు. వక్రబుద్ధితో రాజ్యాంగ స్ఫూర్తిని కొందరు దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వారు హద్దుల్లో ఉండాలని హితవు పలికారు. రాజ్యాంగ వ్యవస్థల్లో ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణను అనుసరిస్తున్నాయి: స్వాతంత్య్రం ఎవరి సొత్తుకాదని మహాత్ముడు చూపిన బాటలో పాలన సాగించాల్సిన అవసరముందని పోచారం శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని.. దేశంలో అమలు చేస్తున్నది ఒక్క కేసీఆర్ మాత్రమేనని తెలిపారు. మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణను అనుసరిస్తున్నాయని వివరించారు. కేంద్రం కొన్ని విషయాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. వాస్తవాలు దాచుకోలేక పోతోందని పోచారం శ్రీనివాస్​రెడ్డి వెల్లడించారు.

"రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కోసం కోర్టు సహాయం కోరాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురు కాలేదు. బడ్జెట్​కు ఆమోదం తెలపకుండా గవర్నర్ వ్యవహరిస్తున్నారు. గవర్నర్ వ్యవస్థపై పార్లమెంట్​లో చర్చ జరగాలి.ప్రతిపక్ష పార్టీలు ఉన్న అనేక రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ గురించి ఇబ్బందులు ఉన్నాయి."-కేశవరావు, ఎంపీ

గవర్నర్ వ్యవస్థపై పార్లమెంట్​లో చర్చ జరగాలి: కేశవరావు

ఇవీ చదవండి:'వక్ర బుద్దితో కొందరు రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తున్నారు'

వివాదంలోకి న్యాయవ్యవస్థను ఎందుకు లాగుతున్నారు..? : హైకోర్టు

అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం.. హైకోర్టులో ముగిసిన విచారణ

'భారత్ జోడో యాత్రతో ఎంతో నేర్చుకున్నా.. ఆ చిన్నారులను చూశాకే ఇలా..'

Last Updated : Jan 30, 2023, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details