BRS MLC Kavitha Social Media Accounts Hacked : రాష్ట్రంలో వరుసపెట్టి చోటుచేసుకుంటున్న రాజకీయ నేతల సోషల్ మీడియా ఖాతాల హ్యాకింగ్ ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) చేరారు. తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కి గురైనట్టు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎక్స్ సహా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేశారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ మేరకు డీసీపీ, సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ట్యాగ్ చేస్తూ కవిత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దిల్లీ మద్యం కేసు - ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు
సైబర్ నేరగాళ్లు మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలుసార్లు హ్యాకింగ్‌కు యత్నిస్తున్నట్లు గుర్తించామన్నారు. సైబర్ నేరగాళ్లు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోగి లాగిన్ అయ్యి సంబంధం లేని ఒక వీడియోను పోస్టు చేసినట్టు పేర్కొన్నారు.
Telangana Governor X Account Hack :రాష్ట్ర గవర్నర్ తమిళిసై(Governer Tamilisai) సౌందరరాజన్ కూడా హ్యాకింగ్ బాధితురాలయ్యారు. ఆమె ఎక్స్ (ట్విటర్) అకౌంట్ హ్యాక్‌కు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు గవర్నర్ ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసి పాస్‌వర్డ్ మార్చినట్లు సమాచారం. కంపెనీ నియమ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎక్స్ కంపెనీ నుంచి గవర్నర్‌కు ఓ మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్ తన అకౌంట్‌ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా, పాస్‌వర్డ్ తప్పంటూ జవాబు వచ్చినట్లు రాజ్‌భవన్ అధికారులు తెలిపారు. అందులో పోస్టులను పరిశీలించిన తమిళిసై, తనకు సంబంధంలేని పోస్టులు పెట్టినట్లు గుర్తించారని వెల్లడించారు.