తెలంగాణ

telangana

ETV Bharat / state

BRS Manifesto Release Today 2023 : నేడే బీఆర్​ఎస్​ మేనిఫెస్టో విడుదల.. హుస్నాబాద్​ నుంచి కేసీఆర్ ఎన్నికల శంఖారావం - KCR Husnabad tour today

BRS Manifesto Release Today 2023 : భారత్ రాష్ట్ర సమితి మేనిఫెస్టో నేడు విడుదల కానుంది. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో అభ్యర్థులతో సమావేశమై.. వారికి బీ ఫారాలు ఇవ్వనున్నారు. తర్వాత మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. సాయంత్రం హుస్నాబాద్‌ బహిరంగసభలో ఎన్నికల ప్రచార శంఖారావం మోగించనున్నారు. మిగిలిన ఐదు స్థానాలకు అభ్యర్థులను నేడు ప్రకటించనున్నారు.

CM KCR Will Release BRS Manifesto
CM KCR Will Release BRS Manifesto Today

By ETV Bharat Telangana Team

Published : Oct 15, 2023, 7:05 AM IST

CM KCR Will Release BRS Manifesto Today నేడే బీఆర్​ఎస్​ మేనిఫెస్టో విడుదల

BRS Manifesto Release Today 2023 :ఎన్నికల బరిలో బీఆర్​ఎస్​ నేడు కీలక అడుగు వేయనుంది. ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థులకు భీ-ఫారమ్​లు, హుస్నాబాద్​లో భారీ బహిరంగ సభ(BRS Public Meeting in Husnabad)తో సీఎం కేసీఆర్​.. ఈ ఎన్నికలో బీఆర్​ఎస్​ యుద్ధాన్ని ప్రకటించనున్నారు. ఇందుకు ముందు నుంచి తీవ్రమైన కసరత్తును ప్రారంభించారు.

BRS Manifesto in Telangana 2023 :ఎన్నికల మేనిఫెస్టో(BRS Election Manifesto)ను బీఆర్​ఎస్ ​అధినేత, సీఎం కేసీఆర్‌.. మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో ప్రకటించనున్నారు. మేనిఫెస్టోపై కొంతకాలంగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇతర పార్టీలు ఇస్తున్న హామీలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు.. వివిధ సర్వేల ఆధారంగా మేనిఫెస్టోని సిద్ధం చేశారు. ఇప్పటికే అమలు చేస్తున్న ఆసరా ఫించన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాల ఆర్థికసాయాన్ని మరింత పెంచనున్నట్లు హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మహిళలను ఆకర్షించేందుకు రెండు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడంతో పాటు రైతులకు ఫించన్లు, ఉచితంగా ఎరువులను.. మేనిఫెస్టోలో పొందుపరచనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

B forms to BRS Candidates Telangana 2023 : బీఆర్​ఎస్​ అభ్యర్థులకు నేడు కేసీఆర్ బీఫారాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే 115 మంది అభ్యర్థులను బీఆర్​ఎస్​ ప్రకటించింది. మల్కాజిగిరి అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీనామా చేశారు. మల్కాజిగిరితో పాటు గతంలో ప్రకటించని జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి అభ్యర్థులకు.. బీఫారాలు ఇవ్వనున్నారు. మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్‌రెడ్డి, జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్‌లో సునీత లక్ష్మారెడ్డి పేర్లు ఖరారయ్యాయి.

అయితే గతంలో ప్రకటించిన 114 మంది అభ్యర్థుల్లో.. ఇద్దరు, ముగ్గురిని మార్చవచ్చునని ప్రచారం సాగుతోంది. బీ ఫారాలు పంపిణీతో పాటు ఎన్నికల(Telangana Polls)పై.. అభ్యర్థులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. తొమ్మిదిన్నరేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం సహా మేనిఫెస్టోను వివరించాలని చెప్పనున్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రచారాన్ని ఎలా తిప్పి కొట్టాలో అభ్యర్థులకు కేసీఆర్ తెలపనున్నారు. నామినేషన్, అఫిడవిట్ల దాఖలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అభ్యర్థులకు బీఆర్​ఎస్​ నేతలు వివరించనున్నారు.

BRS Assembly Elections Plan 2023 : ఎన్నికల బరిలోకి సీఎం కేసీఆర్​.. రోజుకు 3 బహిరంగ సభలు.. 100 నియోజకవర్గాలు టార్గెట్

BRS Public Meeting in Husnabad : అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రచార శంఖారావం మోగించనున్నారు. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి హుస్నాబాద్‌లో తొలి ప్రచారసభ నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌లో అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ, మేనిఫెస్టో విడుదల తర్వాత హైదరాబాద్ నుంచి బయలుదేరి హుస్నాబాద్ వెళ్లి సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. నేటి నుంచి నవంబరు 9వరకు 41 సభల్లో ప్రసంగించనున్నారు. హెలికాప్టర్ ద్వారా.. రోజూ రెండు, మూడు సభల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నవంబరు 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్‌ నామినేషన్లు వేయనున్నారు.

BRS Incharges For 54 Constituencies : పదేళ్ల ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లండి.. 54 నియోజకవర్గాల ఇంఛార్జీలకు కేటీఆర్ దిశానిర్దేశం

BRS Aiming for Hattrick Telangana 2023 : ఓవైపు హ్యాట్రిక్​పై కేసీఆర్ ఫోకస్​.. మరోవైపు మహబూబ్​నగర్​లో మూడోసారి గెలుపుపై కన్నేసిన ఎమ్మెల్యేలు

ABOUT THE AUTHOR

...view details