BRS flag unveiling in London: లండన్‌లో మెుదటిసారిగా బీఆర్ఎస్ జెండాను ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి ఆవిష్కరించారు. ఇటీవల అధికారకంగా టీఆర్ఎస్, బీఆర్ఎస్గా మారిన సందర్భంగా కేసీఆర్‌కి శుభాకాంక్షలు చెప్పారు. నాడు ఉద్యమ సమయంలో ఖండాతరాల్లో మెుట్టమెుదటి గులాబీ ఉద్యమ జెండాను లండన్‌లో ఎగరవేసి కేసీఆర్ వెంట నడిచామమని అదే స్పూర్తితో నేడు దేశంలో గుణాత్మక మార్పు కోసం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ జెండాను సైతం లండన్‌లో చారిత్రాత్మక టవర్ బ్రిడ్జి దగ్గరల్లో ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు. దేశమంతా అభివృద్ధి సంక్షేమం అమలు కావాలంటే అది కేవలం కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమని ఎన్నారైలంతా విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు.
లండన్‌లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ
BRS flag unveiling in London: లండన్‌లో మెుదటిసారిగా బీఆర్ఎస్ జెండాను ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి ఆవిష్కరించారు. భారత్ నుంచి నాయకులని ఆహ్వానించి త్వరలోనే ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు.
లండన్‌లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ
యూకేలో నివసిస్తున్న ఎన్నారైలంతా బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఆసక్తిగా ఉన్నారని అడ్వజరీ బోర్డు వైస్ చైర్మన్ చందు గౌడ్ సిక తెలిపారు. భారత్ నుంచి నాయకులని ఆహ్వానించి త్వరలోనే ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా "దేశ్ కి నేత కెసిఆర్" "అబ్కి బార్ కిసాన్ సర్కార్" అంటూ నినాదాలు చేశారు.
ఇవీ చదవండి: