ఐసీఎంఆర్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న జాతీయ స్థాయి ప్రాజెక్టు ఎన్ఏఆర్ఎఫ్ బీఆర్కు సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య నియమితులయ్యారు. జీనోం వ్యాలీ అభివృద్ధి సమయంలో కీలకంగా వ్యవహరించిన బీపీ ఆచార్యను ప్రాజెక్టుకు సలహాదారుగా ఐసీఎంఆర్ నియమించింది.
ఎన్ఏఆర్ఎఫ్ బీఆర్కు సలహాదారుగా బీపీ ఆచార్య
హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న జాతీయ స్థాయి ప్రాజెక్టు ఎన్ఏఆర్ఎఫ్ బీఆర్కు సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యను ఐసీఎంఆర్ నియమించింది.
ఎన్ఏఆర్ఎఫ్ బీఆర్కు సలహాదారుగా బీపీ ఆచార్య
ప్రీ క్లినికల్ ఎనిమల్ ట్రయల్స్‌కు దోహదపడేలా నేషనల్ ఎనిమల్ రీసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ (ఎన్ఏఆర్ఎఫ్ బీఆర్) సంస్థను ఏర్పాటు చేయనున్నారు. శామీర్‌పేట సమీపంలోని జీనోం వ్యాలీలో వంద ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టు రానుంది. ఫార్మా, బయోఫార్మా, వ్యాక్సిన్ పరిశ్రమల ప్రీ క్లినికల్ ఎనిమల్ ట్రయల్స్‌కు ప్రాజెక్టు ఉపయోగపడనుంది.
ఇదీ చూడండి: సాగర్ పోరు: నేతల మాటల తూటాలతో రసవత్తరంగా రాజకీయం