చిన్న పిల్లలు ఉన్న చోట నిర్లక్ష్యం పనికిరాదు అనే మాట మరోసారి రుజువైంది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం పైడికొండ గ్రామంలో జరిగిన ఈ ఘటనే అందుకు నిదర్శనం. నీళ్లను వేడి చేయడానికి ఉపయోగించే హీటర్ తో.. విద్యుదాఘాతానికి గురై ఓ బాలుడు మృతి చెందాడు. నాలుగో తరగతి చదువుతున్న జ్ఞాన మహేష్‌ను పాఠశాలకు సిద్ధం చేసేందుకు.. ఆయన తండ్రి వేడి నీళ్లు పెట్టాడు. ప్రమాదమని తెలియక ... ఆ బాలుడు హీటర్ ఉన్న బకెట్లో చేయిపెట్టాడు. వెంటనే విద్యుదాఘాతం అయి మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. పది నిమిషాల వరకూ కళ్లముందే తిరిగిన కుమారుడు.. ఉన్నఫళంగా విగతజీవిగా మారడాన్ని.. తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతం.. బాలుడి మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా పైడికొండ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వేడి నీళ్ల కోసం పెట్టిన హీటర్ ఉన్న బకెట్లో ప్రమాదవశాత్తు చేయి పెట్టి ఓ బాలుడు మృతి చెందాడు. చిన్నపాటి నిర్లక్ష్యమే.. ఆ తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చింది.
వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతం.. బాలుడి మృతి