ఈ ఏడాది 2 వేల ఇరవై పుస్తక ప్రదర్శనలను నిర్వహిస్తామని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరి గౌరీ శంకర్ ప్రకటించారు. 33వ జాతీయ పుస్తక ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఈ పుస్తక ప్రదర్శనను 8.5 లక్షల మంది సందర్శించినట్లు వెల్లడించారు. పుస్తక ప్రియుల నుంచి వస్తోన్న ఆదరణ దృష్ట్యా ఏటా రెండు సార్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. గ్రామ, మండల స్థాయికి పుస్తక ప్రదర్శనల్ని తీసుకెళ్లి.. అక్షర తెలంగాణ వైపు రాష్ట్రాన్ని నడిపించడమే ధ్యేయమని పేర్కొన్నారు.
"అక్షర తెలంగాణే... 'బుక్ ఫెయిర్' లక్ష్యం" - book fair success meet
జాతీయ పుస్తక ప్రదర్శనను 8.5 లక్షల మంది సందర్శించినట్లు బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షులు జూలూరి గౌరీ శంకర్ తెలిపారు. అక్షర తెలంగాణ వైపు నడిపించడమే తమ ధ్యేయమని వెల్లడించారు.
'అక్షర తెలంంగాణ వైపు రాష్ట్రాన్ని నడిపించడమే మా ధ్యేయం'