సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం వైభవంగా జరిగింది. బోనాల సందర్భంగా రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించడం సంప్రదాయంగా వస్తోంది. బోనాల్లో భాగంగా ఇవాళ ఉదయం రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ప్రజలందరూ ముడుపులు చెల్లించారని... సంతోషంగా వాటిని అందుకున్నట్లు తెలిపింది. తనకు పూజలెందుకు ఆపుతున్నారని ప్రశ్నించింది. తప్పకుండా బోనం సమర్పించాలని ఆదేశించింది. గంగాదేవికి జలాలతో అభిషేకం, బోనం చేయాలని... అమ్మవారు కరుణించి ప్రజల కోరికలు తీరుస్తుందని పేర్కొంది. ప్రజలందరినీ సుఖసంతోషాలతో చూస్తానని మాటిచ్చింది. ఐదు వారాలపాటు పప్పు, బెల్లంతో శాఖలు, మారు బోనం సమర్పించాలని... ఎలాంటి ఆపద రానివ్వనని స్వర్ణలత తెలిపింది. ఆలస్యమైనా వర్షాలు కురుస్తామని భరోసా ఇచ్చింది.
'రంగంలో భవిష్యవాణి ఏం చెప్పిందంటే..' - రంగం
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వర్ణలత భవిష్యవాణిలో ఈ ఏడాది తప్పకుండా వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చారు.
Bonalu