తెలంగాణ

telangana

ETV Bharat / state

స్నేహితుడి ఖాతా నుంచి బాంబు బెదిరింపు మెయిల్​ - prakash reddy

స్నేహితుడు అంటే మన కోసం తపించేవాడు.. బాధను పంచుకునేవాడు... కానీ ఓ వ్యక్తి మాత్రం తన స్నేహితుడు విదేశాలకు వెళ్తున్నాడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు.​ విదేశాలకు వెళ్లకుండా ఆపాలని పన్నాగం పన్నాడు. ఏకంగా శంషాబాద్​ విమానాశ్రయానికే బాంబు బెదిరింపు మెయిల్​ చేసి చివరకు పోలీసులకు దొరికిపోయాడు.

డీసీపీ ప్రకాశ్​ రెడ్డి

By

Published : Sep 4, 2019, 9:02 PM IST

Updated : Sep 4, 2019, 9:24 PM IST

సాయిరాం, శశికాంత్​ ఇద్దరు మంచి స్నేహితులు సాయిరాం కెనడా వెళ్లేందుకు వీసా వచ్చింది. కానీ శశికాంత్​కు రాలేదు. జీర్ణించుకోలేని శశి మంగళవారం సాయిరాం మెయిల్​ ఐడీతో శంషాబాద్​ విమానాశ్రయానికి బాంబు ఉందని బెదిరింపు మెయిల్ పంపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మెయిల్​ ఐడీ ద్వారా సాయిరాంను విచారించి శశికాంత్​ను నిందితుడిగా గుర్తించామని శంషాబాద్​ డీసీపీ ప్రకాశ్​ రెడ్డి తెలిపారు. అమీర్​పేట్​లోని ఓ హాస్టల్లో ఉన్న శశికాంత్​ను అదుపులోకి తీసుకుని అతని నుంచి ల్యాప్​ టాప్​, రూటర్​ను స్వాధీనం చేసుకున్నామన్నారు.

స్నేహితుడి ఖాతా నుంచి బాంబు బెదిరింపు మెయిల్​
Last Updated : Sep 4, 2019, 9:24 PM IST

ABOUT THE AUTHOR

...view details