కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా విధించిన లాక్డౌన్తో రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గిపోయాయి. తలసేమియా వ్యాధిగ్రస్థులు ఇబ్బంది పడుతున్నందున భాజపా ఆధ్వర్యంలో హైదరాబాద్ కూకట్పల్లిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం - blood donation camp in kukatpally
లాక్డౌన్తో రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గిపోయాయి. తలసేమియా వ్యాధిగ్రస్థులకు రక్తానికి ఇబ్బంది లేకుండా భాజపా యువ మోర్చా నాయకులు హైదరాబాద్ కూకట్పల్లిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
భాజపా యువ మోర్చా నాయకులు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ప్రారంభించారు. లాక్డౌన్ వల్ల రక్తనిల్వలు లేక ఇబ్బంది పడుతున్న తలసేమియా వ్యాధిగ్రస్థుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.