bandi sanjay letter to kcr: మంత్రివర్గంలో వారికి అవకాశమివ్వాల్సిందే.. కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ
09:34 September 26
మంత్రివర్గంలో 8 మంది బీసీలకు స్థానం కల్పించాలి: బండి సంజయ్
బీసీల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు (bandi sanjay letter to cm kcr). బీసీ బంధును అమలు చేయాలని డిమాండ్ చేశారు (bc bandhu). మంత్రివర్గంలో 8మంది బీసీలకు స్థానం కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. అర్హులైన ప్రతి బీసీ కుంటుంబానికి రూ.10లక్షలు ఆర్థిక సాయం అందించాలని కోరారు. జనాభాలో 50శాతానికిపైగా ఉన్న బీసీల సంక్షేమం కోసం బీసీబంధు పథకం ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. బీసీలపై తెరాస ప్రభుత్వం సవతితల్లి ప్రేమను విడాలన్నారు.
తెరాస ప్రభుత్వహయంలో బీసీసబ్‌ప్లాన్ (bc sub plan) అటకెక్కిందని మండిపడ్డారు. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్ట భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 46 బీసీ కులాలకు నిర్మిస్తామన్న ఆత్మగౌరవ భవనాల అడ్రస్ ఎక్కడ అని ప్రశ్నించారు. రూ.3,400 కోట్ల ఫీజురీయింబర్సుమెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. చేనేత కార్మికులకు భీమా, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులను ఆదుకోవడంతో పాటు.. రజకుల కోసం దోబీ ఘాట్లను నిర్మించాలన్నారు. నాయి బ్రాహ్మణులకు 200యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలన్నారు. ఎంబీసీ కార్పొరేషన్‌కు సమృద్ధిగా నిధులు కేటాయించాలని లేఖలో డిమాండ్ చేశారు.