తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగు చట్టాలపై సీఎం కేసీఆర్​ తాజా వైఖరిని స్వాగతిస్తున్నాం: బండి సంజయ్‌ - నియంత్రిత సాగుపై బండి సంజయ్​ స్పందన

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను విమర్శిస్తున్న సీఎం కేసీఆర్‌ తన అభిప్రాయాన్ని మార్చుకుని కితాబు ఇచ్చారని.. దీన్ని స్వాగతిస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. నియంతృత్వపు ఆలోచనల ద్వారా రైతులకు నష్టం చేసినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

bandi
సాగు చట్టాలపై సీఎం కేసీఆర్​ తాజా వైఖరిని స్వాగతిస్తున్నాం: బండి సంజయ్‌

By

Published : Dec 28, 2020, 7:31 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​.. మరొసారి తుగ్లక్ పాలన ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు చూపించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. గత నాలుగు నెలలుగా కేసీఆర్... వ్యవసాయ చట్టాలపై చేసిన విమర్శలు మార్చుకొని కొత్త చట్టాలకు కితాబు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ కళ్లు తెరచి.. పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయ చట్టాలను తెలంగాణలో అమలు చేసేందుకు సంకేతాలు ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

నియంత్రిత సాగు సరైన నిర్ణయం కాదని ప్రభుత్వానికి ఏడాది నుంచి చెప్తూ ఉన్నామని బండి అన్నారు. ఈ పద్ధతి ద్వారా రైతులు మరింత నష్టపోతారని, వాళ్లు వేసే పంటలకు స్వేచ్ఛనివ్వాలని చెప్పినా.. కేసీఆర్ నియంతృత్వ పోకడ మారలేదని విమర్శించారు. ఈ విధానం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి నియంతృత్వపు ఆలోచనల ద్వారా అన్నదాతలకు నష్టం చేసినందుకు కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని బండి సంజయ్​ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:నేటి నుంచి రైతుబంధు... నియంత్రిత సాగుపై కీలక నిర్ణయాలు

ABOUT THE AUTHOR

...view details