తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపాతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి: బండి - బండి సంజయ్​ వార్తలు

రాష్ట్రంలోని నిరుపేదల అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ హెచ్ఎండీఏ లేఅవుట్​లో ప్రభుత్వం కేటాయించిన.. బీసీల ఆత్మగౌరవ భవనాల స్థలాలను మాజీ ఎమ్మెల్యే ఎన్​వీఎస్ఎస్ ప్రభాకర్​తో కలిసి పరిశీలించారు.

bjp state president bandi sanjay who inspected bc's allocate lands
భాజపాతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి: బండి

By

Published : Feb 8, 2021, 5:24 PM IST

హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ హెచ్ఎండీఏ లేఅవుట్​లో ప్రభుత్వం కేటాయించిన బీసీల ఆత్మగౌరవ భవనాల స్థలాలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్.. మాజీ ఎమ్మెల్యే ఎన్​వీఎస్ఎస్ ప్రభాకర్​తో కలిసి పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఎన్నికల ముందే కుల సంఘాలు గుర్తుకొస్తాయని విమర్శించారు. జీవోలు విడుదల చేయడమే తప్ప అందుకు నిధులు విడుదల చేయడం లేదన్నారు.

భాజపాతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి: బండి

ఉప్పల్​లో బీసీలకు చెందిన 22 కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం స్థలాలు కేటాయించి.. రెండేళ్లు అవుతున్నా.. నేటికీ నిర్మాణ పనులు ప్రారంభించలేదని అన్నారు. తెరాస ప్రభుత్వం హయాంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఆ పార్టీలో కొనసాగుతున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని బండి సంజయ్ సూచించారు. రాష్ట్రంలోని నిరుపేదల అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:రెండు పెళ్లిళ్లు చేసుకున్న భర్తకు భార్యల దేహశుద్ధి

ABOUT THE AUTHOR

...view details