తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi Sanjay on BJP meeting: భారీ బహిరంగ సభతో మా సత్తా చూపిస్తాం: బండి సంజయ్

Bandi Sanjay on BJP meeting: మార్చి నెలాఖరులో జనగామలోనే భారీ బహిరంగసభను నిర్వహించి భాజపా సత్తా చూపిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్‌ 14 నుంచి రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల జోనల్ స్థాయి సమావేశంలో అయన మాట్లాడారు.

రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

By

Published : Feb 28, 2022, 5:30 PM IST

Updated : Feb 28, 2022, 7:18 PM IST

Bandi Sanjay on BJP meeting: అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్‌ 14 నుంచి రెండో దశ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభించనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సంస్థాగతంగా భాజపాను బలోపేతం చేయడం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల జోనల్ స్థాయి సమావేశంలో అయన మాట్లాడారు. భాజపాకు ఉనికే లేదని సీఎం కేసీఆర్ జనగామ సభలో అన్నారని.. అందుకే మార్చి నెలాఖరులో జనగామలోనే భారీ బహిరంగ సభను నిర్వహించి సత్తా చూపిస్తామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తూ భాజపా నాయకులు దాదాపు 2 నిమిషాలపాటు చప్పట్లతో స్వాగతించారు.

రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

రాబోయే రోజుల్లో మంత్రులతోపాటు తెరాస సిట్టింగ్ ఎమ్మెల్యేల అవినీతి,అక్రమాలపై జిల్లాలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉద్యమిస్తామన్నారు. అందరం కలిసి ప్రజాస్వామిక తెలంగాణను ఏర్పాటు దిశగా కృషి చేద్దామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ఇన్​ఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ సహాయ కార్యదర్శి శివ ప్రకాశ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సీనియర్ నేత ఎన్.ఇంద్రసేనారెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, గరికపాటి రామ్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, మంత్రి శ్రీనివాస్ పాల్గొన్నారు.

‘‘మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ ఎన్నికల సంఘానికి సమర్పించిన తప్పుడు ఆఫిడవిట్‌పై ఫిర్యాదు చేసిన వారిని పోలీసులే కిడ్నాప్‌ చేయడం అత్యంత దారుణం. తప్పుడు అఫిడవిట్‌పై ఎన్నికల కమిషన్ విచారణ ముగిసే వరకు ఆరుగురు ఫిర్యాదుదారులను జైల్లో పెట్టడమే లక్ష్యంగా కేసులు పెట్టారు. భాజపా.. ఇలాంటి దారుణాలను అడ్డుకుని తీరుతుంది. మంత్రి రాజీనామా చేసేంత వరకు పార్టీ పరంగా ఆందోళనలను కొనసాగిస్తాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర మంత్రులతో పాటు తెరాస సిట్టింగ్ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉద్యమిస్తాం. అందరం కలిసి ప్రజాస్వామిక తెలంగాణను ఏర్పాటు చేసే దిశగా కృషి చేద్దాం’.- బండి సంజయ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చూడండి:

Last Updated : Feb 28, 2022, 7:18 PM IST

ABOUT THE AUTHOR

...view details