సమాజంలోని అన్ని వర్గాలను ఆదుకునేందుకు మోదీ ప్రభుత్వం సిద్దంగా ఉందనడానికి కేంద్ర సర్కార్ ప్రకటించిన ప్యాకేజీయే నిదర్శనమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా జారీ చేసిన జీవో పట్ల తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
'రైతు బంధు ఎగ్గొట్టడానికి ఇదొక సాకు' - bandi sanjay fires on telangana government
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతులు, కార్మికులు, చిరువ్యాపారులు, మధ్య తరగతి ప్రజలకు భరోసా కల్పించే విధంగా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రైతులపై కేసీఆర్ సర్కార్ నిరంకుశంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.
'రైతు బంధు ఎగ్గొట్టడానికి ఇదొక సాకు'
కేసీఆర్ సర్కార్ వైఖరిని నిరసిస్తూ శనివారం ఉదయం 10నుంచి 11గంటల మధ్య రాష్ట్రవ్యాప్తంగా భాజపా కార్యకర్తలు తమ ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేస్తారని సంజయ్ తెలిపారు. తాను చెప్పిన పంటలు వేస్తేనే రైతుబంధు ఇస్తాననడం నిరంకుశత్వానికి నిదర్శనంగా పేర్కొన్నారు. రైతుబంధును ఎగ్గొట్టడానికి సీఎం ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.