మేడ్చల్ జిల్లా భాజపా నేతలతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆన్‌లైన్ యాప్ ద్వారా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని సంజయ్ ఆరోపించారు. ఇందిరాగాంధీ తరహాలోనే కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. 1975 దమనకాండను నేటి తరానికి తెలిపేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సంజయ్ పేర్కొన్నారు.
తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది: బండి సంజయ్ - బీజేపీ వార్తలు
తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఇందిరాగాంధీ తరహాలోనే కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మేడ్చల్ జిల్లా భాజపా నేతలతో బండి ఆన్‌లైన్ యాప్ ద్వారా సమావేశం నిర్వహించారు.
తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ: బండి సంజయ్
అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఆనాటి ప్రధాని నియంతృత్వంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించి రాజకీయ నేతలను, కవులు, కళాకారులను జైల్లో పెట్టారని తెలిపారు. దశాబ్దాలుగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనుగుణంగా వ్యవహరించలేదని విమర్శించారు.
ఇదీ చూడండి:హరితహారంలో కేసీఆర్.. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించిన సీఎం