తెలంగాణ

telangana

ETV Bharat / state

'వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు... తెరాస ఎంత?' - కేసీఆర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. హిందుత్వాన్ని అణిచివేయాలని చూస్తే కాలగర్భంలో కలిసిపోతారన్నారు.

'వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు... తెరాస ఎంత?'
'వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు... తెరాస ఎంత?'

By

Published : Nov 13, 2020, 6:27 PM IST

Updated : Nov 13, 2020, 7:04 PM IST

హిందువుల మనోభావాలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిసారీ హిందూ పండుగలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హిందువుల పండుగలను వివాదాస్పదం చేయడం అలవాటైపోయిందని దుయ్యబట్టారు. టపాకాయల దుకాణాలకు ప్రభుత్వమే అనుమతిచ్చి ఇప్పుడు బంద్ చేయమంటే ఎలా అని ప్రశ్నించారు.

ముందుచూపు లేకపోవడం వల్లనే చిరు వ్యాపారులు నష్టపోతున్నారన్నారు. పెద్ద మొత్తాల్లో దీపావళి టపాకాయల నిల్వల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. దీపావళి నిషేదం వల్ల నష్టపోతున్న చిరు వ్యాపారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

హిందుత్వాన్ని అణిచివేయాలని చూసిన మొగల్స్, నిజాంలు కాలగర్భంలో కలిసిపోయారని... తెరాస ప్రభుత్వం ఎంత అని అన్నారు. 192 దేశాల్లో న్యూ ఇయర్ వేడుకల్లో టపాకాయలు కాల్చినప్పుడు రాని కాలుష్యం ఒక్కరోజు దీపావళి వల్ల వస్తుందా అని ప్రశ్నించారు.

Last Updated : Nov 13, 2020, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details