కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్‌లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ స్వాగతించారు. ఈ మేరకు తాను చేపట్టనున్న 'గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష' ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న తమ డిమాండ్ మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: బండి సంజయ్ - ఆయుష్మాన్ భారత్‌పై బండి సంజయ్
ఆయుష్మాన్ భారత్‌లో చేరాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఇదే డిమాండ్‌తో తలపెట్టిన 'గరిబోళ్ల కోసం బీజేపీ దీక్ష' వాయిదా వేసుకున్నట్లు వెల్లడించారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో అమలు చేయాలని భాజపా చేసిన ఒత్తిడి ఫలించిందని బండి సంజయ్ అన్నారు. కాస్త ఆలస్యంగానైనా రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకపోతే తమ ఉద్యమ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.