Bjp state executive meeting: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని శామీర్‌పేటలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి పార్టీ జెండా ఆవిష్కరించి అమరవీరుల చిత్రపటాల వద్ద నివాళులర్పించి ప్రారంభించారు. నివాళులర్పించిన వారిలో డీకే అరుణ, విజయశాంతి, ఈటల రాజేందర్ ఉన్నారు. ఈ కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానాలు, బండి సంజయ్ చేపట్టబోయే అయిదో విడత ప్రజా సంగ్రామ యాత్ర గురించి చర్చించనున్నారు.
బైంసా నుంచి అయిదో విడత పాదయాత్ర : ఈనెల 28 నుంచి బండి సంజయ్ అయిదో విడత పాదయాత్ర చేపట్టనున్నారు. బాసర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బండి సంజయ్ ఈ పాదయాత్రను బైంసా నుంచి ప్రారంభించనున్నారు. డిసెంబర్ 15 లేదా 16 వరకు అయిదో విడత పాదయాత్ర కొనసాగనుంది. కరీంనగర్లో ముగింపు సభ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటివరకు 21 జిల్లాల్లో 1,178 కి.మీ మేర బండి సంజయ్ పాదయాత్ర చేశారు.
ప్రతి నియోజకవర్గంలో 200 బైకులతో ర్యాలీలు :ఈనెల 26 నుంచి వచ్చేనెల 14 వరకు 'ప్రజాగోస - భాజపా భరోసా యాత్ర' అనే కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమావేశంలో నిర్ణయించారు. ఒక్కో ఎంపీ స్థానంలోని ఒకటి లేదా రెండు అసెంబ్లీ స్థానాల్లో బైక్ ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మెదక్, దుబ్బాక, ఆందోల్, జహీరాబాద్, గద్వాల, నాగర్‌కర్నూల్, జడ్చర్ల, షాద్‌నగర్, చేవెళ్ల, పరిగి, నల్గొండ, సూర్యాపేట, తుంగతుర్తి, పరకాల, వర్ధన్నపేట, మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాల్లో ఈ బైక్ ర్యాలీలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో 200 బైకులతో 10 నుంచి 15 రోజులు బైక్ ర్యాలీలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. స్థానిక సమస్యలపై ప్రతి గ్రామంలో కార్నర్ మీటింగ్లు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
రెండు రోజుల క్రితం శామీర్‌పేటలోనే బీజేపీ శిక్షణా తరగతులు జరిగాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఈ శిక్షణ తరగతులను ప్రారంభించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యదర్శులు వివిధ జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు. శిక్షణ తరగతుల్లో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై చర్చించారు.
ఇవీ చదవండి: