హైదరాబాద్ భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జీహెచ్‌ఎంసీకి నూతనంగా ఎన్నికైన పార్టీ కార్పొరేటర్లు సమావేశమయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
భాజపా కీలక సమావేశం.. కార్పొరేటర్లకు దిశానిర్దేశం
12:50 December 05
భాజపా కీలక సమావేశం.. కార్పొరేటర్లకు దిశానిర్దేశం
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ నేతలు మురళీధర్ రావు, లక్ష్మణ్, రాంచందర్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్, వివేక్ తదితరులు హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు దిశా నిర్ధేశం చేశారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలపై నేతలు సమీక్షించడంతోపాటు భవిష్యత్ కార్యాచరణపై సుధీర్ఘంగా చర్చిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అమలు చేయాలి అనే అంశాలపై మంతనాలు జరుపుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో భాజపా 48 డివిజన్లలో విజయం సాధించింది. గతంలో నాలుగు సీట్ల నుంచి భారీగా పుంజుకుంది. ఈ ఫలితాలపై ఉత్సాహంగా ఉన్న భాజపా రాష్ట్ర నేతలు ఇదే పట్టుదలను ప్రదర్శించాలని భావిస్తున్నారు.
ఆయా అంశాలన్నింటిపైనా నేతలు దృష్టిసారించారు. అలాగే భాజపా విజయానికి దోహదం చేసిన అంశాలు.. కొన్నిచోట్ల ఓటమికి కారణాలను విశ్లేషిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా నిర్దేశించుకున్న భాజాపా ఆ దిశగా కసరత్తు చేయనుంది.
ఇదీ చూడండి :సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం: హైకోర్టు