తెలంగాణలో ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పేదల కోసం నేడు భారతీయ జనతా పార్టీ దీక్షకు పిలుపునిచ్చింది. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చడంతో పాటు చికిత్స పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.
కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని నేడు భాజపా దీక్ష - భాజపా దీక్ష
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు నేడు ఉదయం 10 గంటల నుంచి.. ఆ పార్టీ నాయకులు దీక్షచేయనున్నారు. ఆరోగ్య శ్రీలో కరోనా చికిత్సను చేర్చాలని డిమాండ్ చేశారు.
కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని నేడు భాజపా దీక్ష
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు ఈ దీక్ష చేస్తున్నట్లు భాజపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ మండల పదాధికారులనుంచి రాష్ట్రస్థాయి నాయకులంతా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఇంట్లోనే కొవిడ్ నిబంధనలు, లాక్ డౌన్ మార్గదర్శకాలకు అనుగుణంగా నిరసన చేస్తారని వెల్లడించారు.
ఇదీ చూడండి:కొత్తగా ఆరు కళాశాలల మంజూరుతో ప్రభుత్వ వైద్యరంగానికి ఊతం