తెలంగాణ

telangana

ETV Bharat / state

'దమ్ముంటే మున్సిపల్​ ఎన్నికలు ప్రత్యక్షంగా జరపాలి' - KCR

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని చూస్తోందని తెరాస ప్రభుత్వంపై భాజపా ఎంపీలు అర్వింద్, సంజయ్, బాపురావు ఆరోపించారు. ​ భాజపా, మోదీ అంటేనే కేసీఆర్​ వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు.

BJP MPs

By

Published : Jul 17, 2019, 6:01 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. మరోవైపు భాజపా, మోదీ అంటే వణికిపోతున్నారని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఎద్దేవా చేశారు. తప్పుల తడకగా ఉన్న ఓటర్ల జాబితాతో మున్సిపల్​ ఎన్నికలు నిర్వహించి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోంపిచారు. దమ్ముంటే మున్సిపల్ ఎన్నికల్లను ప్రత్యక్షంగా నిర్వహించాలంటూ సీఎం కేసీఆర్​కు సవాల్ విసిరారు. బీజేపీ,ఆపార్టీ ఎంపీల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంపై లోక్ సభను తెరాస తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని మరో ఎంపీ బండి సంజయ్ దుయ్యబట్టారు. ముందు రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు నిర్మించారో లెక్క చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

'దమ్ముంటే మున్సిపల్​ ఎన్నికలను ప్రత్యక్షంగా జరపాలి'

ABOUT THE AUTHOR

...view details