న్యాయవాదుల సంక్షేమం... వారికి భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రామచందర్ రావు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టులో న్యాయవాదులను కలిసి ప్రచారం నిర్వహించారు. ఇటీవల న్యాయవాద దంపతులు హత్యల తర్వాత రాష్ట్ర మంత్రులు, నాయకులు నోరుమెదకపోవడం బాధాకరమన్నారు.
న్యాయవాదులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలం: రామచందర్ రావు
న్యాయవాదుల సంక్షేమం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రామంచదర్ రావు విమర్శించారు. హైదరాబాద్లోని నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఆయన ప్రచారం చేశారు. తనకు అన్ని వర్గాల నుంచి మద్దతు ఉందని పేర్కొన్నారు.
న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.10కోట్లు 2015లో ప్రకటించి... 2017లో తాను అడిగే వరకు బయటకు తీయలేదన్నారు. హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, బార్ కౌన్సిల్ నుంచి వచ్చే ఆర్థిక సాయం, మెడికల్ అలవెన్స్ సక్రమంగా ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై శాసనమండలిలో ఆరేళ్లు గళం వినిపించానని... ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉన్నానని గుర్తు చేశారు. తనకు అన్ని వర్గాల నుంచి మద్దతు ఉందని... గతంలో కంటే భారీ మెజారిటీతో గెలుస్తానని రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:ఆరోగ్య రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణ.. టింటో ర్యాంగ్