తెలంగాణ

telangana

ETV Bharat / state

Etela Rajender: నాపై అలాంటి వార్తలు రావడాన్ని ఖండిస్తున్నా: ఈటల - ఈటల రాజేందర్

Etela Rajender on cm kcr: రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలన అంతం చేయడమే నా లక్ష్యమని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తాను సీఎం అభ్యర్థినంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని స్పష్టం చేశారు.

Etela Rajender
Etela Rajender

By

Published : Aug 10, 2022, 10:36 PM IST

Etela Rajender: కాషాయ జెండాను తెలంగాణ గడ్డ మీద ఎగరవేయడమే ధ్యేయమని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలనను అంతమొందించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. భాజపా ఏ బాధ్యత ఇస్తే దానిని శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని ఈటల వెల్లడించారు. తాను సీఎం అభ్యర్థినంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

నేను సీఎం అభ్యర్థినంటూ వస్తున్న వార్తలను ఖండిస్తున్నా. 20 ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ బలోపేతానికి పనిచేశా. రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలన అంతమే నా లక్ష్యం. కాషాయ జెండాను తెలంగాణ గడ్డ మీద ఎగరవేయడమే ధ్యేయం. భాజపా ఏ బాధ్యత ఇస్తే దానిని శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తా. - ఈటల రాజేందర్, భాజపా ఎమ్మెల్యే

భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని ఈటల రాజేందర్‌ తెలిపారు. భాజపా శ్రేణులు పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు. పదవులను వ్యక్తులుగా నిర్ణయించుకోలేరన్నారు. భాజపా ఆదేశాలకు అనుగుణంగా నాయకులు పనిచేస్తారని ఈటల స్పష్టం చేశారు. నేతల సామర్థ్యాన్ని గుర్తించి భాజపా నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

ఇవీ చదవండి:'ఎవరిని నిలబెట్టినా గెలిపించేందుకు సై..' అసంతృప్తులతో మంత్రి చర్చలు సఫలం..

'నిరాశతో 'చేతబడి'ని ఆశ్రయిస్తోంది'.. కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు!

ABOUT THE AUTHOR

...view details