BJP MLA Candidates Fourth List in Telangana : 12 మంది అభ్యర్థులతో బీజేపీ నాలుగో జాబితా విడుదల చేసింది. ఇప్పటికే మూడు దశల్లో 88 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తం 100 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా మరో 19 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ 19 స్థానాల్లో 12 బీజేపీకి.. మరో 7 స్థానాలు జనసేనకు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం.
నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ - బీసీ ఆత్మగౌరవ సభకు హాజరు
బీజేపీ నాలుగో జాబితా అభ్యర్థుల వివరాలు
- చెన్నూరు బీజేపీ అభ్యర్థిగా దుర్గం అశోక్
- ఎల్లారెడ్డి బీజేపీ అభ్యర్థిగా సుభాష్‌రెడ్డి
- హుస్నాబాద్ - బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి,
- సిద్దిపేట - దూది శ్రీకాంత్‌రెడ్డి,
- వికారాబాద్ - పెద్దింటి నవీన్‌కుమార్
- కొడంగల్ - బంటు రమేష్‌కుమార్,
- గద్వాల్-బోయ శివ
- మిర్యాలగూడెం - సాధినేని శ్రీనివాస్
- మునుగోడు - కృష్ణారెడ్డి
- నకిరేకల్ - మొగులయ్య
- ములుగు - అజ్మీరా ప్రహ్లాద్‌నాయక్
- వేములవాడ - తుల ఉమ
42 మందితో బీజేపీ ప్రచారకర్తల జాబితా విడుదల, చర్చల అనంతరం విజయశాంతి, రఘునందన్ రావు పేర్లు
అతి త్వరలోనే మిగిలిన అభ్యర్థుల ప్రకటన.. : తెలంగాణ ఎన్నికలకు సంబంధించి తొలి విడతలో 52 మంది అభ్యర్థులను ప్రకటించిన భారతీయ జనతా పార్టీ.. రెండో విడతలో ఒకే ఒక పేరును ప్రకటించింది. మూడో విడతలో 35 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కమలం పార్టీ.. తాజాగా మరో 12 స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. నామినేషన్‌కు మరో 3 రోజులే మిగిలి ఉండటంతో మిగిలిన సీట్లనూ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
BJP MLA Campaign in Telangana 2023 :మరోవైపు.. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన నియోజకవర్గాల్లో బీజేపీ ప్రచారాలను ముమ్మరం చేసింది. బీ ఫారమ్‌లు అందుకున్న నేతలు నామినేషన్లు దాఖలు చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. పార్టీ ముఖ్య నాయకుల్లో గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్ ఇప్పటికే నామినేషన్ వేయగా.. సోమవారం కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ భారీ బైక్ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. నేడు గజ్వేల్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ నామినేషన్ వేయనుండగా.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఇద్దరూ కలిసి హైదరాబాద్ చేరుకుని ప్రధాని మోదీ బీసీ ఆత్మగౌరవ సభ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ బీజేపీ ఛార్జ్‌షీట్
సాయంత్రం 5.05 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియానికి చేరుకుని బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొంటారు. 5:30 గంటల నుంచి 6:10 గంటల వరకు సభలో పాల్గొంటారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగనున్న ప్రధాని ప్రసంగంలో పలు కీలక హామీలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సభ అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి 6:35 గంటలకు దిల్లీకి తిరుగు పయనం అవుతారు.
Telangana BJP MLA Candidate Second List : బీజేపీ రెండో జాబితా విడుదల.. మహబూబ్‌నగర్ నుంచి రేసులో..