రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్రం కాపీకొడతోందని తెరాస చేస్తున్న విమర్శలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఖండించారు. హైదరాబాద్‌లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్... పార్టీ శ్రేణులు రాజకీయపరమైన యుద్ధానికి సిద్ధం కావాలని సూచించారు. రాష్ట్రం నిరుద్యోగ సమస్య, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వంటి సమస్యలతో సతమతమవుతున్నా... ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని మండిపడ్డారు. హైదరాబాద్‌ను వంద రోజుల్లో విశ్వనగరంగా మారుస్తానని మున్సిపల్ ఎన్నికల ముందు తెరాస నేత కేటీఆర్ చేసిన వాగ్దానం విస్మరించారని విమర్శించారు. 1000 రోజులు పూర్తయిన ఆ ఊసే లేదని హైదరాబాద్ విషాదకరంగా మారిందని ఆరోపించారు. ఎక్కడి సమస్యలు అక్కడే ప్రజలను పట్టిపీడిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. గుజరాత్‌కు వెళ్ళి అక్కడే నీటి పథకాలను పరిశీలించి... రాష్ట్రంలో ఆయా పథకానికి మిషన్ భగీరథ అని నామకరణం చేసి అమలు చేస్తూ ప్రస్తుతం కేంద్రం ఆ పథకాలను కాపీ కొడుతున్నది అనడంలో అర్థం లేదని ఆయన వివరించారు. తెరాసకు భాజపా అంటే వణుకు పుడుతోందని కేంద్ర మాజీ మంత్రి మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు.
'రాష్ట్రంలో 18 లక్షలకు పైగా సభ్యత్వ నమోదే లక్ష్యం'
హైదరాబాద్ రాంనగర్‌లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. రాష్ట్రంలో18 లక్షల పైచిలుకు సభ్యత్వాలు చేర్చే లక్ష్యంతో కార్యకర్తలు ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.
BJP Membership Registration