తెలంగాణ

telangana

ETV Bharat / state

'మరో 18 లక్షల సభ్యత్వాల నమోదే భాజపా లక్ష్యం'

దేశంలో కాంగ్రెస్‌ , కమ్యూనిస్టు పార్టీలు కుచించుకుపోతున్నాయని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. మోదీ అవినీతి రహిత పాలనను మెచ్చిన ప్రజలు అధిక సంఖ్యలో భాజపాలో చేరుతున్నారన్నారు.

'మరో 18 లక్షల సభ్యత్వాల నమోదే భాజపా లక్ష్యం'

By

Published : Jul 24, 2019, 9:01 PM IST

భాజపా సభ్యత్వ నమోదు యాప్‌ను హైదరాబాద్​లో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల సభ్యత్వాలుండగా వాటిని ఈసారి మరో 18 లక్షలకు పెంచేలా కృషిచేయాలని కార్యకర్తలకు సూచించారు. కర్ణాటకలో రాజకీయ పరిణామాలు శుభపరిణామంగా అభివర్ణించారు. దక్షిణాదిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. మాజీ ఎంపీ వివేక్‌ భాజపాలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడం శుభపరిణామం అన్నారు. అవినీతి, కుటుంబ పాలనను ప్రజలు ఇంటికి సాగనంపుతున్నారన్నారు.

'మరో 18 లక్షల సభ్యత్వాల నమోదే భాజపా లక్ష్యం'
ఇదీ చూడండి: దాడులకు భయపడేది లేదు: రాంచందర్​రావు

ABOUT THE AUTHOR

...view details