తెలంగాణ

telangana

ETV Bharat / state

'పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లినా లక్ష్మణ్​ దీక్ష ఆగదు' - లక్ష్మణ్​ అరెస్టు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ నిర్బంధం అప్రజాస్వామికమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్​ ఆరోపించారు. 9 లక్షల మంది విద్యార్థుల జీవితాల పట్ల తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.

భాజపా కార్యదర్శి

By

Published : Apr 29, 2019, 4:21 PM IST

అప్రజాస్వామిక విధానాలను భాజపా సహించదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. ఇంటర్ ఫలితాల్లో లోపాలకు నిరసనగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిరవధిక దీక్ష ప్రారంభిస్తే పోలీసులు నిర్బంధించటం దారుణమని హైదరాబాద్​లో ఆక్షేపించారు. పోలీసులు ఎక్కడికి తరలించినా ఆయన దీక్ష కొనసాగుతుందని తెలిపారు. రేపు పార్టీ తరఫున అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసన తెలుపుతామని ప్రకటించారు.

లక్ష్మణ్​ నిర్బంధం అప్రజాస్వామికమన్న మురళీధర్​

ABOUT THE AUTHOR

...view details