BJP complained to EC against TRS: మునుగోడు ఉపఎన్నికలో భాజపాను, పార్టీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిని బదనాం చేసే ఉద్దేశంతో తెరాస నకిలీ బ్యాంకు ఖాతాలు సృష్టించినట్లు భాజపా నేతలు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌ను కలిసిన భాజపా బృందం.. తెరాస రాజగోపాల్‌రెడ్డిపై ఈసీకి ఇచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇచ్చారు. ఫిర్యాదులో పేర్కొన్న ఖాతాలకు సుశీ ఇన్ఫ్రా నుంచి ఎలాంటి లావాదేవీలు జరగలేదని వారు పేర్కొన్నారు.
ఉపఎన్నికలో టీఎన్జీవో నేతలు బహిరంగంగా తెరాసకు వత్తాసు పలుకుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్ సహా నేతలపై ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని చెప్పారు. భాజపా నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్న భాజపా నేతలు.. తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.