తెలంగాణ

telangana

ETV Bharat / state

Central ministers met manda krishna: మందకృష్ణకు కేంద్ర మంత్రుల పరామర్శ.. నేడు జాతీయ మహాసభకు హాజరు - sc employees federation national meeting in hyderabad

ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కేంద్ర మంత్రులు(Central ministers met manda krishna).. హైదరాబాద్​లోని ఆయన నివాసంలో పరామర్శించారు. కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి, మురుగన్​, నారాయణ స్వామి, ఎమ్మెల్యే రఘునందన్​ రావు.. మందకృష్ణ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. నేడు బోయిన్​పల్లిలో జరగనున్న ఎస్సీ ఉద్యోగుల సమాఖ్య జాతీయ మహాసభకు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.

Central ministers met manda krishna
మందకృష్ణను పరామర్శించిన కేంద్ర మంత్రులు

By

Published : Oct 24, 2021, 1:15 PM IST

ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్య పరిష్కారానికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి(Central ministers met manda krishna), తన వంతు పాత్ర పోషించాలని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆకాంక్షించారు. ఇటీవల దిల్లీలో గాయపడిన మందకృష్ణను కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, అబ్బయ్య నారాయణ స్వామి, లోకనాథన్‌ మురుగన్‌లు పరామర్శించారు. హైదరాబాద్​లోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మందకృష్ణతో కలిసి అల్పాహారం తీసుకున్నారు.

మందకృష్ణ మాదిగ కుటుంబ సభ్యులతో కిషన్​ రెడ్డి

మాదిగ ఉద్యోగుల 5వ జాతీయ మహాసభకు హాజరయ్యేందుకు కేంద్రమంత్రులు(Central ministers met manda krishna) హైదరాబాద్‌కు వచ్చారని మందకృష్ణ మాదిగ తెలిపారు. నేడు సికింద్రాబాద్ బోయిన్​పల్లిలో జరగనున్న ఎస్సీ ఉద్యోగుల సమాఖ్య ఐదో జాతీయ మహాసభకు కేంద్ర మంత్రులు(Central ministers met manda krishna) కిషన్​ రెడ్డి,​ మురుగన్​, నారాయణ స్వామి హాజరుకానున్నారు.

కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డితో నాకు 25ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. ఎమ్మార్పీఎస్​కు మద్దతునిస్తూ.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం పాటుపడ్డారు. నేను దిల్లీలో కాలు విరిగి పడినప్పుడు.. ఇంటికి చేరేవరకు నా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకున్నారు. మురుగన్, నారాయణ స్వామి సైతం.. ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేశారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఎస్సీ వర్గీకరణ పరిష్కారంలో కేంద్ర మంత్రులు తమ వంతు పాత్ర పోషించి, మాదిగల ఆకాంక్ష నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. -మందకృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు

మందకృష్ణ మాదిగతో కలిసి కేంద్రమంత్రులు(Central ministers met manda krishna) అల్పాహారం తీసుకున్నారు. వారు తన యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు.

మందకృష్ణకు కేంద్ర మంత్రుల పరామర్శ

ఇదీ చదవండి:హుజూరాబాద్‌లో వేడెక్కిన రాజకీయం.. గెలుపు కోసం పోటాపోటీ ప్రచారం

ABOUT THE AUTHOR

...view details