తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదలకు సరకులు పంపిణీ చేసిన భాజపా నేత శాంతాబాయి - lockdown

సికింద్రాబాద్​ అడ్డగుట్ట డివిజన్​లో భాజపా నేత శాంతాబాయి పేదలకు సరకులను అందజేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని శాంతాబాయి కోరారు.

bjp leader shanthabhai groceries distribution in hyderabad
పేదలకు సరకులు పంపిణీ చేసిన భాజపా నేత శాంతాబాయి

By

Published : May 16, 2020, 12:10 AM IST

సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధి అడ్డగుట్ట డివిజన్​లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పేదలకు డివిజన్​ మహిళా అధ్యక్షురాలు శాంతాబాయి నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్​లోనే కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో నగర ప్రజలంతా అప్రమత్తతతో మెలగాలని పార్టీ డివిజన్ మహిళా అధ్యక్షురాలు శాంతాబాయి బెస్త సూచించారు.

లాక్​డౌన్ అమలు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి కృషి చేస్తున్నాయని, ప్రజలు కూడా ప్రభుత్వాలకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని శాంతాబాయి కోరారు.

ABOUT THE AUTHOR

...view details