Muralidhar Rao on Upcoming Elections in Telangana :తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి మార్పు కారణంగా పార్టీకి నష్టం వచ్చిందంటూ అనడం సరైంది కాదనీ మధ్యప్రదేశ్ బీజేపీ ఇంఛార్జ్ మురళీధర్‌రావు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జాతీయ నాయకత్వం.. అధ్యక్షుడి మార్పునకు మొగ్గుచూపిందని.. ఎందుకు మార్చారు అనేది పార్టీ పెద్దలకు బాగా తెలుసన్నారు.
బండి సంజయ్‌కి పార్టీలో నేతలందరినీ కలుపుకుపోవడం.. ఇబ్బందికరమని భావించి అధినాయకత్వం తప్పించింది కావొచ్చన్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో కొందరు పెద్ద నాయకులు వస్తారని... వారిని కలుపుకుపోవడంపై ఇబ్బందులు వస్తాయని భావించి తప్పించారని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీనియర్, జూనియర్ అని బేధభావాలు రావొచ్చనే ఉద్దేశంతో అలా చేసి ఉండొచ్చన్నారు. హైదరాబాద్ వచ్చిన మురళీధర రావు.. మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు.
Muralidhar Rao on Present Politics in Telangana : కేసీఆర్‌ను(KCR) వెల్ఫేర్ విషయంలో కొట్టలేమని.. అలా అని ప్రతిసారి వెల్ఫేర్ పేరుతో కూడా వారు గెలవలేరన్నారు. కేసీఆర్‌ను కొట్టాలంటే.. ప్రజాసమస్యలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని.. లేదంటే ఓడించలేమని పేర్కొన్నారు. తెలంగాణ జనాభాలో యూత్ 65 శాతం మంది ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఇవాళ నిరుద్యోగ సమస్య తీవ్రంగా వెంటాడుతోంది. యువతకు అండగా ఉంటే సులభంగా కేసీఆర్‌ను ఓడించొచ్చన్నారు. ప్రజాధనంను కొల్లగొట్టి అవినీతి చేసినోళ్లు అంతా జైలుకు పోవాల్సిందేనని.. అందుకే జైళ్లు కడుతున్నామని పరోక్షంగా కవితను ఉద్దేశించి అన్నారు.