నరేంద్ర మోదీని ఎదుర్కొనే నాయకుడు ప్రతిపక్ష పార్టీల్లో లేకనే అందరూ కలిసి జతకట్టారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ఐదేళ్ల నరేంద్ర మోదీ పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ మరోసారి ఆయనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారన్నారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై నేతలు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కొత్త, పాత కలయికతో తెరాసకు దీటైన ప్రత్యామ్నాయ శక్తిగా మారుతామని ధీమా వ్యక్తం చేశారు.
'శాసనసభకు భిన్నంగా లోక్‌సభ ఫలితాలు' - TELANGANA
"శాసనసభ ఎన్నికలకు భిన్నంగా లోక్‌సభ ఫలితాలు ఉంటాయి. ఎవరు ప్రధాని కావాలన్న అంశంపైనే ఈ ఎన్నికలు జరగుతున్నాయి. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపే సత్తా భాజపాకే ఉంది. ప్రజలు మళ్లీ నరేంద్రమోదీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారు."--- కె. లక్ష్మణ్
మరోసారి మోదీనే ప్రధాని...!