తెలంగాణ

telangana

ETV Bharat / state

'దిల్లీలో కాళ్లు.. హైదరాబాద్​లో కన్నీళ్లు' - bjp leader laxman on telangana government schemes

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేశారో తెరాస చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్​ చేశారు. తెరాస నాయకులు దిల్లీలో కాళ్లు, హైదరాబాద్​లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్​ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ గాల్లో కలిసిపోయాయని విమర్శించారు.

bjp leader laxman fires on cm kcr
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

By

Published : Dec 13, 2019, 1:35 PM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలంగాణను అప్పుల, అవినీతి రాష్ట్రంగా మార్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఆర్థిక మంత్రి ప్రమేయం లేకుండానే సమీక్షలు చేయడమేంటని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలన్నీ ఒక్కొక్కటిగా మూలన పడుతున్నాయని లక్ష్మణ్​ అన్నారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్​ అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు.

అంగన్​ వాడీలకు నిధులు ఇవ్వలేక.. మూసివేయాలని ప్రభుత్వం చూస్తోందని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అన్నదాతకు ఆలంబనగా ఉంటుందనుకున్న రైతు బంధు బంద్​ అయ్యేలా ఉందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ, సమత, మానస ఘటనలు ఫ్రెండ్లీ పోలీస్​ ఎక్కడుందని ఎద్దేవా చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో మద్యం నిషేధించే వరకు భాజపా పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేశారో తెరాస చెప్పాలని లక్ష్మణ్​ డిమాండ్​ చేశారు. తెరాస నాయకులు దిల్లీలో కాళ్లు.. హైదరాబాద్​లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి : బంజారాహిల్స్​లో వ్యక్తి దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details