తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు భాజపా మహిళా సంకల్ప దీక్ష - mahila sankalpa yatra

రాష్ట్రంలో మద్యపాన నిషేధం పై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణలో మద్యపానానికి వ్యతిరేకంగా భాజపా నేత డీకే అరుణ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో విడతల వారిగా మద్యాన్ని నిషేధించాలని ప్రత్యక్ష పోరాటానికి దిగనున్నారు. ఇందుకోసం నేడు ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ వద్ద మహిళా సంకల్ప దీక్షచేపట్టనున్నారు .

bjp-leader-dk-aruna-mahila-sankalpa-yatra-in-hyderabad
మహిళా సంకల్ప దీక్షలో... గద్వాల జేజమ్మ..

By

Published : Dec 12, 2019, 4:06 AM IST

Updated : Dec 12, 2019, 8:18 AM IST

మహిళా సంకల్ప దీక్షలో... గద్వాల జేజమ్మ..

తెలంగాణలో మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ భాజపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి డీకే అరుణ నేడు మహిళా సంకల్ప దీక్షలో కూర్చోనున్నారు. హైదరాబాద్‌ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద ఆమె దీక్ష చేపట్టనున్నారు. నేటి నుంచి రెండురోజుల పాటు జరిగే మహిళా సంకల్ప దీక్షను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారటం వల్లనే మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయని డీకే.అరుణ ఆరోపించారు.

మద్యపానాన్ని నిషేధించే వరకు..

మద్యం సేవించిన తరవాతనే నిందితులు దిశపై అత్యాచారానికి ఒడిగట్టారని ఆమె గుర్తు చేశారు. దేవాలయాలు, బడులు, జాతీయ రహదారులు అనే తేడా లేకుండా ప్రభుత్వం మద్యం దుకాణాలకు ద్వారాలు తెరించిందని ఆమె ధ్వజమెత్తారు. మద్యపానాన్ని నిషేధించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని డీకే అరుణ స్పష్టం చేశారు. ఈ ఉద్యమంలో ప్రజా సంఘాలు, మహిళలు, మేధావులు కలసిరావాలని కోరారు.

ఇవీ చూడండి: 'మద్యం వల్లే మహిళలపై అఘాయిత్యాలు'

Last Updated : Dec 12, 2019, 8:18 AM IST

ABOUT THE AUTHOR

...view details