మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌లోని ఓ గ్రూపును ప్రోత్సహించి... అక్కడ పాగా వేసేందుకు భాజపా ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. భాగ్యనగరం హిమాయత్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డితో కలిసి మీడియాతో నారాయణ మాట్లాడారు. ఫిరాయింపులకు పాల్పడేవారు ఆ క్షణం నుంచే అర్హత కోల్పోవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారని నారాయణ గుర్తుచేశారు.
మధ్యప్రదేశ్‌లో భాజపా అనైతిక చర్యలు : సీపీఐ నారాయణ
మధ్యప్రదేశ్‌లో భాజపా అనైతిక చర్యలకు పాల్పడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 23న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు.
Narayana
వాజ్‌పేయి ఒక్క ఓటుతో ప్రధాని పదవిని కోల్పోయారని... ఆయన నేడు జీవించి ఉంటే... ఫిరాయింపులను చూసి ఆత్మహత్య చేసుకునే వారన్నారు. దిల్లీ అల్లర్లు... ఆర్ఎస్ఎస్ పనేనని ఆయన ఆరోపించారు. జస్టిస్ మురళీధర్‌ను బదిలీ చేసేందుకు అదే కారణమని తెలిపారు. న్యాయవ్యవస్థను కేంద్రం ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 23న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు.