తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్​ బరిలో నిలిచేందుకు అభ్యర్థులకు భాజపా ఆహ్వానం - గ్రేటర్​ హైదరాబాద్​లో భాజపా తాజా వార్తలు

గ్రేటర్​ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఆహ్వానం పలుకుతున్నట్లు రాష్ట్ర భాజపా ప్రకటించింది. భాజపా తరపున పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న వాళ్ల నుంచి బయోడేటాను స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులకు దరఖాస్తులు అందించాలని పేర్కొంది.

bjp invited applications
గ్రేటర్​లో ఆసక్తి ఉన్న అభ్యర్థులకు భాజపా ఆహ్వానం

By

Published : Nov 16, 2020, 1:39 PM IST

గ్రేటర్‌ హైదరాబాద్​ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఆహ్వానం పలుకుతున్నట్లు రాష్ట్ర భాజపా ప్రకటించింది. భాజపా తరపున పోటీకి ఆస్తకి ఉన్న వాళ్ల నుంచి బయోడేటాను ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది.

గ్రేటర్ పరిధిలో ఆరుగురు అధ్యక్షులను నియమించినట్లు భాజపా తెలిపింది. డివిజన్ల వారీగా అభ్యర్థుల పనితీరుపై రాష్ట్ర నాయకత్వం సర్వే చేయనున్నట్లు పేర్కొంది. సర్వేలో ముందు వరుసలో ఉన్న వారికే టికెట్లు ఇస్తామని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:అంతర్జాలం అనుకూలించదు.. సాంకేతికత సహకరించదు!

ABOUT THE AUTHOR

...view details