పూరానాపూల్ డివిజన్లోని 18 పోలింగ్‌బూత్‌లలో ఇష్టారాజ్యంగా రిగ్గింగ్‌కు చేశారంటూ పాతబస్తీ సిటీ కళాశాల డీఆర్సీ కేంద్రం వద్ద భాజపా నాయకులు ఆందోళన నిర్వహించారు. చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ తన అనుచరులతో వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ భాజపా ఇన్చార్జ్ ఉమామహేంద్ర ఆరోపించారు. ఎంఐఎం ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి అన్ని పోలింగ్బూతుల్లో రీపోలింగ్ నిర్వహించాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు.
చార్మినార్ ఎమ్మెల్యే రిగ్గింగ్‌కు పాల్పడ్డారంటూ భాజపా ధర్నా
గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ అధికారులను బెదిరించి రిగ్గింగ్‌కు పాల్పడారంటూ భాజపా ధర్నాకు దిగింది. చార్మినార్ నియోజకవర్గ భాజపా ఇన్ఛార్జ్ ఉమామహేంద్ర ఆధ్వర్యంలో డీఆర్సీ కేంద్రం వద్ద కార్యకర్తలు ఆందోళన చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి రీపోలింగ్ నిర్వహించాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు.
చార్మినార్ ఎమ్మెల్యే రిగ్గింగ్‌కు పాల్పడ్డారంటూ భాజపా ధర్నా
భాజపా అభ్యర్థి సురేంద్రకుమార్ ప్రిసైడింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ధర్నాకు దిగారు. రిటర్నింగ్ అధికారి, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో భాజపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేంద్ర, సురేంద్రకుమార్, నంబూరి రామలింగేశ్వరరావు, కునాల్, బల్వీర్ సింగ్, కార్యకర్తలు పాల్గొన్నారు.