హైదరాబాద్ కాప్రా భూ అక్రమాలపై కేసు నమోదైన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కాప్రా ఇంఛార్జ్ తహశీల్దార్ గౌతమ్‌ను వెంటనే అరెస్టు చేయాలని రామంతాపూర్, హబ్సిగూడ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరారు. ఈ రెండు డివిజన్ల అధ్యక్షులు బండారు వెంకట్రావు, హరీష్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు ధర్నా చేపట్టారు. ఉప్పల్, చిలుకానగర్ డివిజన్లలోనూ భాజపా నేతలు ఆందోళన నిర్వహించారు.
'ఎమ్మెల్యే సుభాశ్ రెడ్డిని అరెస్టు చేయాలి'
హైదరాబాద్ కాప్రా భూఅక్రమాలపై కేసు నమోదైన ఉప్పల్ ఎమ్మెల్యే సుభాశ్ రెడ్డి, ఇంఛార్జ్ తహశీల్దార్ గౌతమ్‌ను వెంటనే అరెస్టు చేయాలని భాజపా కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.
భాజపా కార్పొరేటర్లు, భాజపా కార్పొరేటర్ల ఆందోళన, భాజపా కార్పొరేటర్ల ధర్నా
అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుభాశ్ రెడ్డి, గౌతమ్ కుమార్‌లను కేసు నుంచి తప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని తెరాస పార్టీకి చెందిన కింది స్థాయి నాయకుల నుంచి పైస్థాయి వరకు భూఅక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెరాస పాలన అవినీతి మయంగా మారిందని విమర్శించారు.
- ఇదీ చదవండిNTR Birthday: బాలయ్య 'శ్రీరామ దండకం'