ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస పార్టీ అభ్యర్థులు ఓడిపోతామనే భయంతోనే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు అబద్దాలు, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర భాజపా నాయకత్వం మండి పడింది. అవాస్తవాలను ప్రచారం చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నాన్ని.. మేధావులు, ఉద్యోగస్థులు, కార్మికులు, ఐటి నిపుణులు తిప్పికొడతారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల శేఖర్‌రావు అన్నారు.
'నిరుద్యోగులు,ఉద్యోగస్థులను తెరాస మోసం చేసింది' - trs cheated unemployed employees
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస పార్టీ అభ్యర్థులు ఓడిపోతామనే భయంతోనే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు అబద్దాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర భాజపా నాయకత్వం పేర్కొంది. వాటిని విద్యార్థులు, మేధావులు, ఉద్యోగస్థులు, కార్మికులు, స్వీకరించరని.. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల శేఖర్‌రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని మేధావులంత భాజపాకు ఓటు వేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, కార్మికులను మోసం చేసిందని మండి పడ్డారు. కొవిడ్ కారణంగా అనేక రంగాల్లో ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకోవడంలో విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ఆత్మనిర్భర్ భారత్ ద్వారా భరోసా కల్పిస్తుందన్నారు. రాబోయే రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి :తెలంగాణ ఉద్యమంలో ఆస్తులన్నీ కోల్పోయా: జిట్టా బాలకృష్ణారెడ్డి