BJP Assembly Election Plan 2023 :అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగాభారతీయ జనతా పార్టీ(Telangana BJP) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల కసరత్తులో నిమగ్నమైన ఆ పార్టీ నాయకత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకునేందుకు సిద్ధమైంది. బీసీ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగేందుకు కమలదళం ప్రణాళికలు రచిస్తోంది.
BJP MLA Candidate Selections : ఈ నెల 15 లేదా 16న.. బీజేపీ మొదటి జాబితా అభ్యర్థుల ప్రకటన
Telangana Assembly Elections 2023 : ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపిస్తున్న ఆ పార్టీ నాయకులు.. ఎన్నికల ప్రచారంలో ఇదే నినాదంతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బీసీల ఓట్లే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ నాయకత్వం.. 88 నియోజకవర్గాల్లో 35 నుంచి 40 టికెట్లు బీసీలకు కేటాయించే యోచనలో ఉంది. అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్‌లకు 5 టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రాష్ట్రంలో కీలక బీసీ నేతలు కాషాయ తీర్థం పుచ్చుకుంటున్నారు. నిన్న నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో వీరశైవ లింగాయత్ రాష్ట్ర అధ్యక్షుడు వన్నె ఈశ్వరప్ప.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీజేపీ రాజకీయంగా బీసీలకు పెద్ద పీట వేస్తోందని పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు.