Bhatti Vikramarka on Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో వైద్య రంగంపై ఇవాళ వాడీవేడిగా చర్చ జరిగింది. సీల్పీ నేత భట్టి విక్రమార్క వైద్య విద్య, కొత్త ప్రభుత్వ ఆసుపత్రుల అంశం గురించి పలు ప్రశ్నలు లేవనెత్తారు. హైదరాబాద్ చుట్టూ ఐదు ఆసుపత్రులు కడతామని హామీ ఇచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ఒక్కటైనా నిర్మించారా? భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లలో కొత్తగా ఒక్క ఆసుపత్రి కూడా నిర్మించలేదని ఆరోపించారు. తెలంగాణ శాసనసభలోమాట్లాడిన ఆయన.. కేసీఆర్ సర్కారు.. బీఆర్‌ఎస్ పార్టీకి ఉపయోగపడేవి నిర్మించి.. ప్రజలకు ఉపయోగపడేవి నిర్మించట్లేదని విమర్శించారు.
ఉస్మానియాలో కొత్త భవనం నిర్మించేందుకు ఇంకా ఖాళీ స్థలం ఉందని సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భట్టి ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం నామమాత్రంగా మిగిలిందని అభిప్రాయపడ్డారు. ఫీజు బకాయిల వల్ల విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య విద్య ఫీజులు భారీగా పెంచి పేదలకు భారంగా మార్చారని ధ్వజమెత్తారు.
Etela Rajender Speech in Assembly 2023 : 'ప్రభుత్వం ఘనంగా ప్రకటిస్తోందే కానీ.. అమలు చేయట్లేదు'
Telangana Assembly Sessions 2023 : ప్రభుత్వ ఆసుపత్రిల్లో వైద్య సేవలు అందించే సిబ్బంది లేరని విమర్శించారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే ఇల్లు, పొలం అమ్ముకునే పరిస్థితి వస్తోందని దుయ్యబట్టారు. అలాగే.. విద్యలో తెలంగాణ చివరి నుంచి ఆరోస్థానంలో ఉందని.. ఈశాన్య రాష్ట్రాలు మాత్రమే మనకంటే తక్కువ ర్యాంకుల్లో ఉన్నాయని భట్టి విక్రమార్క సభలో వ్యాఖ్యానించారు.