Best Incubator Award for T hub: టీహబ్‌కు భారత్‌లో ఉత్తమ ఇంక్యుబేటర్ అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2022 జాతీయ స్టార్టప్ అవార్డుల్లో ఇంక్యుబేటర్ విభాగంలో టీహబ్‌కు ఈ పురస్కారం లభించింది. ఈ మేరకు కేంద్రమంత్రులు పీయూశ్ గోయల్, సోం ప్రకాశ్ దిల్లీలో అవార్డులను ప్రకటించారు. ఇంక్యుబేటర్ విభాగంలో దేశవ్యాప్తంగా 55 సంస్థలు పోటీ పడగా.. టీహబ్‌కు అవార్డు దక్కింది. రాష్ట్రంలో సుమారు రెండున్నర వేల స్టార్టప్‌ల స్థాపనలో టీహబ్ కృషి చేసింది. టీహబ్ స్టార్టప్‌లు సుమారు 1.9 బిలియన్ల యూఎస్ డాలర్లు, దాదాపు 12వేల ఉద్యోగాలను సృష్టించినట్లు పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీహబ్ సీఈవో ఎంఎస్ఆర్ తెలిపారు. అవార్డు రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
టీహబ్‌కు మరో జాతీయ అవార్డు.. భారత్‌లో ఉత్తమ ఇంక్యుబేటర్‌గా గుర్తింపు - 2022 National Startup Award Awarded to T Hub
Best Incubator Award for T hub: కొత్త అంకుర సంస్థలకు చిరునామాగా మారిన టీహబ్.. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే మంచి ఫలితాలతో పాటు అవార్డులనూ తెచ్చిపెడుతోంది. తాజాగా కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన 2022 జాతీయ స్టార్టప్ అవార్డుల్లో ఇంక్యుబేటర్ విభాగంలో ఉత్తమ అవార్డు లభించింది. ఈ మేరకు కేంద్రమంత్రులు పీయూశ్ గోయల్, సోం ప్రకాశ్ దిల్లీలో అవార్డులను ప్రకటించారు.
Teahub