తెలంగాణ

telangana

ETV Bharat / state

Beer Price Reduce: మద్యం ప్రియులకు తీపి కబురు... తగ్గిన బీరు ధర - బీరు ధర పదిరూపాయలు తగ్గింపు

తెలంగాణ ప్రభుత్వం బీరు ధర తగ్గిస్తూ (beer price) నిర్ణయం తీసుకుంది. సీసాపై రూ.10 తగ్గిస్తూ అబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రత్యేక ఎక్సైజ్‌ సెస్‌ పేరుతో సీసాపై రూ.30 పన్ను విధించేది. దీని నుంచి రూ.10 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఎక్సైజ్‌శాఖ తెలిపింది.

beer price
beer price

By

Published : Jul 5, 2021, 9:06 PM IST

తెలంగాణలో బీరు సీసాపై పది రూపాయలు తగ్గిస్తూ (beer price) రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో బీరు విక్రయాలు భారీగా పడిపోవడంతో... సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో బీరు సీసాపై ప్రత్యేక ఎక్సైజ్‌ సెస్‌ పేరుతో 30 రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం విధించింది.

ఈ ప్రత్యేక ఎక్సైజ్‌ సెస్‌లో నుంచి పది రూపాయలను మాత్రమే తగ్గించింది. ఈ నిర్ణయంతో బీరు సీసాపై ముద్రించిన గరిష్ఠ చిల్లర ధరలో పది రూపాయలు తగ్గుతుందని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఎక్సైజ్‌శాఖ తెలిపింది. ఎంఆర్పీపై పది రూపాయలు తగ్గడంతో... అది నేరుగా వినియోగదారుడికి ప్రయోజనం చేకూరుతుందని సీఎస్​ వివరించారు.

ఇదీ చూడండి:Sharmila: సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న షర్మిల పార్టీ జెండా!

ABOUT THE AUTHOR

...view details