తెలంగాణ

telangana

ETV Bharat / state

BC Gurukula schools: 'బీసీ గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందించాలి' - మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల

BC Gurukula schools: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశించారు. గురుకుల సోసైటీ రీజినల్ కోఆర్డినేటర్ అధికారుల సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు.

BC Gurukula schools
గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలన్న బుర్రా వెంకటేశం

By

Published : Dec 10, 2021, 9:18 PM IST

BC Gurukula schools: పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం సూచించారు. రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల సోసైటీ రీజినల్ కోఆర్డినేటర్ అధికారుల సమావేశంలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.

food in gurukul schools: విద్యార్థులకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించాలని.. పోషకాహార లోపాలు తలెత్తకుండా చూసుకోవాలని చెప్పారు. ప్రతి రీజినల్ కోఆర్డినేటర్ ప్రతి నెలలో తప్పనిసరిగా నాలుగు రోజులు పాఠశాలలో రాత్రి బస చేయాలని బుర్రా తెలిపారు. పాఠశాలల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని వెల్లడించారు. విద్యాబోధన, ఆహారం, మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి అలసత్వం జరగకూడదని స్పష్టం చేశారు. ప్రతి రీజనల్ కోఆర్డినేటర్ తప్పనిసరిగా తన పరిధిలోని పాఠశాలలను తరచూ సందర్శించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details