తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బతుకమ్మ పండుగ వైభవం దుబాయ్‌లో కనుల విందు చేసింది. ఇవాళ బతుకమ్మ పాటకు పట్టాభిషేకం జరిగింది. విశ్వవేదికపై బతుకమ్మ వైభవం చాటి చెప్పింది. ప్రపంచంలోనే ఎత్తైన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ వీడియో ప్రదర్శన కనుల విందుగా జరిగింది. బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మతో పాటు సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని ప్రదర్శించారు. ఒకేసారి లక్ష మంది వీక్షించేలా భారీ తెర ఏర్పాటు చేశారు.
BATHUKAMMA ON BURJ KHALIFA: బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పాటకు పట్టాభిషేకం.. కనులవిందుగా ప్రదర్శన
దుబాయ్‌లో బతుకమ్మ పాటకు పట్టాభిషేకం జరిగింది. విశ్వవేదికపై బతుకమ్మ వైభవం కనులవిందు చేసింది. బతుకమ్మ ప్రాశస్త్యం, విశిష్ఠత, సంబురాల సంస్కృతిని తెలిపేలా బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ వీడియో ప్రదర్శించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వీడియో ప్రదర్శన నిర్వహించారు. ప్రపంచంలోనే అతి పెద్ద తెర బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన వైభవంగా జరిగింది.
బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పాటకు పట్టాభిషేకం
బతుకమ్మ పండుగ ప్రాశస్త్యం, విశిష్ఠత, సంబురాల సంస్కృతిని తెలిపేలా వీడియో రూపొందించి ఎంతో గొప్పగా ప్రదర్శించారు. ఈ వేడుకను తిలకించేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, గణేశ్ గుప్తా, సురేందర్, షకీల్, జీవన్‌రెడ్డి, సంజయ్, రాజ్యసభ సభ్యులు సురేశ్ రెడ్డి ఆమె వెంటే ఉన్నారు.
ఇదీ చూడండి: