ఒప్పంద అధ్యాపకులకు కూడా బేసిక్ పే (Basic Pay) అమలవుతుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) తెలిపారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల ఒప్పంద అధ్యాపకులు బేసిక్ పే అమలు చేస్తూ ఉత్తర్వుల ప్రతిని ఐకాస నేతలకు మంత్రులు హరీశ్, సబిత, జగదీశ్‌రెడ్డి అందించారు.
Harish Rao: ఒప్పంద అధ్యాపకులకు కూడా బేసిక్ పే అమలు - Telangana news
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) పేర్కొన్నారు. ఒప్పంద అధ్యాపకులకు కూడా బేసిక్ పే అమలవుతుందని తెలిపారు.
బేసిక్ పే
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న హరీశ్‌రావు (Harish Rao) ఈ దిశగా సీఎం కేసీఆర్... చర్యలు తీసుకుంటూ దేశానికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ఐకాస నేతలను మంత్రులు అభినందించారు. బేసిక్ పే ఉత్తర్వు విడుదల చేసినందుకు ఐకాస నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: Vh: సీఎం కేసీఆర్‌కు అంబేద్కర్‌పై గౌరవం ఉందా?