తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశంలో రెండో స్థానంలో 'బ్యాంక్ ఆఫ్ బరోడా'

బ్యాంక్ ఆఫ్ బరోడా 112 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్యాంక్ అధికారులు హైదరాబాద్​లోని ఓ హోటల్లో కస్టమర్స్ మీట్​ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా హైదరాబాద్ జోన్ డిప్యూటీ జోనల్ హెడ్ సత్యనారాయణ పాల్గొన్నారు.

దేశంలో రెండో స్థానంలో 'బ్యాంక్ ఆఫ్ బరోడా'

By

Published : Aug 10, 2019, 5:31 PM IST

హైదరాబాద్​ లక్డీకపూల్​లోని ఓ హోటల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా 112 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్యాంక్ అధికారులు కస్టమర్స్ మీట్​ను నిర్వహించారు. కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా హైదరాబాద్ జోన్ డిప్యూటీ జోనల్ హెడ్ సత్యనారాయణ పాల్గొన్నారు. బ్యాంకుల ప్రాధాన్యత పెరిగిన ప్రస్తుత తరుణంలో తమ బ్యాంక్ ఖాతాదారులకు అత్యుత్తమ సేవలు అందిస్తోందని ఆయన తెలిపారు. విజయ బ్యాంక్, దేనా బ్యాంక్​ల విలీనంతో మరింత మెరుగుపడ్డామని, బిజినెస్ టర్నోవర్​లో దేశంలో రెండో స్థానంలో కొనసాగుతున్నామని పేర్కొన్నారు. సామాన్యులకు సైతం బ్యాంకు సేవలను అందించేందుకు గ్రామ స్థాయి వరకు తమ బ్రాంచీలను విస్తరిస్తున్నట్లు స్పష్టం చేశారు.

దేశంలో రెండో స్థానంలో 'బ్యాంక్ ఆఫ్ బరోడా'

ABOUT THE AUTHOR

...view details